వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రేపల్లె మునిసిపల్ కమీషనర్ సాంబశివరావు అన్నారు. శుక్రవారం రేపల్లె నేతాజీ మునిసిపల్ హైస్కూల్ లోని విద్యార్థినీ, విద్యార్థులకు సీజనల్ వ్యాధులపై మునిసిపల్ అధికారులు అవగాహన కల్పించారు. కలుషితమైన ఆహారం, నీరు ద్వారా టైఫాయిడ్, కలరా, డయెరియా వ్యాధులు వస్తాయని, దోమల ద్వారా మలేరియా, పైలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా తదితర వ్యాధులు సంక్రమిస్తాయని, అందువలన ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.