మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ లో మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యను అతి దారుణంగా చంపిన ఘటన మండలంలోని బైరంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. బాధితుల ప్రకారం.. గ్రామానికి చెందిన బండారి బాలమణి భర్త బచ్చయ్య సోమవారం మధ్యాహ్నం సమయంలో భార్య బాలమణి నిద్రిస్తుండగా గొడ్డలితో మెడపై నరికి చంపినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొంతకాలంగా తాగుడుకు బానిసైన బచ్చయ్యను మద్యం మాన్పించేందుకు నాటు వైద్యం చేయించారు.మధ్యాహ్న సమయంలో భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడినట్లు సమాచారం. బాలమణి మధ్యాహ్నం సమయంలో నిద్రిస్తుండగా ఒక్కసారిగా గొడ్డలితో కొట్టి చంపినట్టు పేర్కొన్నారు. ఈ దారుణమైన ఘటనకు సంబంధించిన స