బైరెడ్డిపల్లి: మండలం గడ్డిండ్లు గ్రామానికి చెందిన చంద్రశేఖర్ (27) ఆదివారం హంద్రీనీవా కాలువలో స్నానానికి వెళ్లి నీటి వేగానికి సుడిగుండంలో చిక్కుకుని మృతి చెందాడు. స్నేహితులతో కలిసి కాలువలో స్నానం చేస్తున్నప్పుడు ఈ విషాదం చోటుచేసుకుంది. గతంలో వాలంటీర్గా పనిచేసిన చంద్రశేఖర్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.సమాచారం అందుకున్న రాష్ట్ర వైసిపి కార్యదర్శి కృష్ణమూర్తి చంద్రశేఖర్ మృతదేహానికి నివాళులర్పించారు వారి కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు అన్ని విధాల మీ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.