జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కథలాపూర్ మండలం దుంపేటగ్రామంలో ఉపాధ్యాయనిగా పుల్లూరి పురుషోత్తం పనిచేస్తున్నారు.మండలంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకి ఎంపికయ్యారు.ఈ సందర్భంగా తోటి ఉపాధ్యాయులతో పాటు జిల్లా,మండల విద్యాశాఖ అధికారులు అభినందిస్తూ శుభకాంక్షలు తెలిపారు. మంగళవారం సన్మానించి ప్రశంసా పత్రంతో పాటు అవార్డును అందజేశారు. పుల్లూరి పురుషోత్తం స్వగ్రామమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలో ప్రజా ప్రతినిధులు గ్రామ యువతీ యువకులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.