రొళ్ల మండల పరిధిలోని టీడీ పల్లి గ్రామానికి చెందిన మేకల కాపరి రంగధామప్ప బుధవారం సాయంత్రం ఎలుగుబంటి దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామ సమీపంలోని కొండ వద్ద మేకల మేపడానికి వెళ్లగా ఎలుగుబంటి దాడి చేసి గాయపరిచింది. స్థానిక రైతులు గుర్తించి హుటాహుటిన రంగధామప్పను మడకశిర ఆస్పత్రికి తరలించారు.