యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు పట్టణ కేంద్రంలోని ప్రతాపరెడ్డి ఆసుపత్రిలో శుక్రవారం సాయంత్రం దారుణం చోటుచేసుకుంది. వైద్యం వికటించి కమటంగూడెం గ్రామానికి చెందిన ఏనుగుల ఉదయ్ అనే వ్యక్తి మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లనే మృతి చెందాడని ఆరోపిస్తూ మృతిని బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టి, డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుడు ఉదయ్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. దీంతో ఆస్పత్రి ముందు ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.