చిలుకూరు మండలం జానకీ నగర్ స్టేజీ వద్ద కోదాడ-జడ్చర్ల రహదారిపై ధాన్యం లోడుతున్న వెళుతున్న లారీ అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కు పోయాడు.స్థానికులు లారీ అసోసియేషన్ వారికి సమాచారం అందించగా ఘటన స్థలానికి వారు చేరుకొని డ్రైవర్ను సురక్షితంగా బయటికి తీశారు. సడన్ బ్రేక్ వేయడంతో లారీ బోల్తా కొట్టిందని స్థానికులు తెలిపారు.