జైపూర్లోని ఎస్టీపీపీ డిస్పెన్సరీ మెడికల్ సూపరింటెండెంట్ గా డాక్టర్ జానకి గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహించిన డాక్టర్ రవీందర్, డాక్టర్ శ్యామల గోదావరిఖనిలోని సింగరేణి ఏరియా ఆసుపత్రికి బదిలీ అయ్యారు. రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ జానకిని ఇక్కడికి బదిలీ చేశారు. ఈ సందర్భంగా డిస్పెన్సరీ పారామెడికల్ సిబ్బంది ఆమెకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.