మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో *మల్లెల నరసయ్య అనే రైతు తాను పది ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాడు, సరైన సమయానికి యూరియా వెయ్యాలని మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పొగళ్లపల్లి కి కొత్తగూడ సబ్ సెంటర్ కి తిరిగి తిరిగి చివరికి పంట ఎర్రబడుతుందని మనస్థాపంతో వ్యవసాయం పొలం దగ్గరికి వెళ్లి ఈసారి వ్యవసాయం చేయడం వల్ల పెట్టుబడి కూడా రాదు అని మనస్థాపంతో గడ్డి మందు తాగాడు.. హుటా హుటిన అంబులెన్స్ లో కొత్తగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు మెరుగైన వైద్యం కోసం నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.