యాదాద్రి భువనగిరి జిల్లా, సంస్థాన్ నారాయణపురం మండలం, పుట్టపాక-గట్టుప్పల్ మధ్యలోని ఆర్మల్ల వాగు నిన్న కురిసిన భారీ వర్షానికి ఉధృతంగా ప్రవహించడంతో కారు కొట్టుకుపోయింది. ఆదివారం ఉదయం స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మల్ల వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అది గమనించకుండా శనివారం రాత్రి కారు వాగు దాటేందుకు ప్రయత్నించగా వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. అప్రమత్తమైన కారు డ్రైవర్ హుటాహుటిన కారులో నుంచి బయటకు దూకి ప్రాణాలను కాపాడుకున్నాడు. కారులో డ్రైవర్ ఒక్కడే ఉండగా ప్రాణహాని తప్పింది.