కనిగిరి పట్టణంలోని నాలుగవ సచివాలయాన్ని మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలోని పలు రికార్డులను ఆయన పరిశీలించారు. సచివాలయానికి వచ్చే ప్రజలను కార్యాలయం చుట్టూ ఎక్కువ రోజులు తిప్పుకోకుండా, నిర్దిష్ట కాలపరిమితితో వారి సమస్యలను పరిష్కరించాలని సచివాలయ సిబ్బందిని మున్సిపల్ చైర్మన్ ఆదేశించారు. అవినీతికి ఆస్కారం లేకుండా సచివాలయంలో విధులు నిర్వర్తించాలన్నారు. ఏదైనా పనిపై బైటికి వెళ్లాలంటే తప్పనిసరిగా మూమెంట్ రిజిస్టర్ లో సిబ్బంది ఎందుకు వెళ్తున్నామో తెలియజేస్తూ సంతకం చేసి వెళ్ళాలని సూచించారు.