అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని గండుగులపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.. ఉపాధ్యాయ దినోత్సవానికి నాంది పలుకుతూ గురువుల త్యాగస్ఫూర్తిని స్మరించుకున్నారు.. అనంతరం దమ్మపేట మండల కేంద్రంలో ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల మరియు జూనియర్ కళాశాలలో (గురుపూజోత్సవ) ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఉద్దేశించి ప్రసంగించారు..