జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామంలో అనాగరిక ఘటన చోటుచేసుకుంది.ఇందుకు సంబందించిన వివరాల మేరకు... గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్బంగా గణపతి చందా ఇవ్వలేదని గ్రామానికి చెందిన అరుణ్, గంగ లచయ్య, అంజి,సూర్య వంశీ ల నాలుగు కుటుంబాలను కులం నుండి కుల పెద్దలు బహిష్కరించారు.ఆ కుటుంబాలతో ఎవరు మాట్లాడకూడదని ఊర్లో డప్పు చప్పుల్లతో దండోర వేయించారు.వెలివేసిన కుటుంబాలతో ఎవరైన మాట్లాడితే 25 వేల జరిమానా ఉంటుందని హుకుం కూడా జారీ చేశారు. అంతేకాకుండా ఆ కుటుంబాలతో అ కులానికి చెందిన ఎవరైనా మాట్లాడినట్లు సమాచారం అందించిన వారికి 5 వేల నజరానాను కూడా ప్రకటించారు.భక్తితో దేవుడికి కొబ్బరికాయ కొట్టేందుకు...