పలమనేరు: రూరల్ సిఐ గా పరుశురాముడు బుధవారం బాధ్యతలు స్వీకరించారని స్టేషన్ వర్గాలు తెలియజేశారు. గతంలో బైరెడ్డిపల్లి ఎస్సైగా పనిచేసిన ఆయనకు ఇటీవల ప్రమోషన్ వచ్చిన సంగతి విధితమే, పలమనేరు రూరల్ సర్కిల్ పరిధిలో బైరెడ్డిపల్లి, పెద్దపంజాణి స్టేషన్లు వస్తాయి. గతంలో ఆయన ఎస్ఐగా పని చేసిన సర్కిల్లోనే సీఐగా తన బాధ్యతలు నిర్వర్తించబోతుండడం విశేషం. ఈ సందర్భంగా స్థానిక నేతలు క్రింది స్థాయి పోలీసు సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.