నల్గొండ జిల్లా వ్యాప్తంగా పలు ఫర్టిలైజర్ దుకాణాలలో శుక్రవారం వ్యవసాయ అధికారులతో కలిసి టాస్క్ ఫోర్స్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ.. ఎవరైనా జిల్లాలో ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న యూరియాను రైతులకు అందించకుండా అక్రమంగా నిర్వహించి, ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు కాకుండా అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులను మోసం చేసి అధిక ధరలకు విక్రయిస్తున్న పాలు ఫర్టిలైజర్ దుకాణాల యజమానులపై కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.