జిన్నారం మున్సిపల్ కేంద్రంలో సేవా పక్షం కార్యక్రమాన్ని మెదక్ బీజేపీ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా పయనిస్తోందని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే బీజేపీ లక్ష్యమని, సేవా పక్షం కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వ పథకాలు చేరేలా కృషి చేస్తున్నామని అన్నారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి ఆశీర్వాదం ఇవ్వాలని కోరారు.