చండ్రుగొండ మండలం తిప్పనపల్లి పంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అవినీతి చోటుచేసుకుంటుంది. పంచాయతీ పరిధిలోని మహ్మద్ నగర్,బీబీ నగర్ గ్రామాలకు చెందిన గ్రామస్తులు కొందరు పంచాయతీ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు.ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కొరకు డబ్బులు ముట్టచెప్తేనే స్థానిక నాయకులు,అధికారులు ఇల్లు మంజూరు చేస్తున్నారని ఆరోపిస్తూ వారికి వ్యతిరేకంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.