పదవ తరగతి పరీక్షల మరియు మూల్యాంకన విధులకు సంబంధించిన పారితోషికం పగటి కలలాగా మారిపోయిందని యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్ బాబు తెలిపారు. బుధవారం సాయంత్రం కడప జిల్లా విద్యాశాఖాధికారి షేక్ శంషుద్దీన్ గారిని కలిసి మరోమారు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా పాలెం మహేష్ బాబు మాట్లాడుతూ గత మార్చి నెలలో జరిగిన పదవ తరగతి పరీక్షల విధులకు సంబంధించి చీప్ సూపరింటెండెంట్ మరియు డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు పరీక్షల మరియు మూల్యాంకన విధులకు సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని వచ్చారని ఇంతవరకు పారితోషికం చెల్లించకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.