డి.హిరేహాల్ మండలం కూడ్లూరు గ్రామంలో పురాతన శివాలయంలో దొంగలు పడ్డారు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత గుర్తు తెలియని దుండగులు ఆలయ గోపురంపై ఉన్న కళశాన్ని దొంగలించేందుకు గోపుర కలశానికి తాడుకట్టి కిందకు లాగేందుకు యత్నించారు. అదే సమయంలో సమీపంలోని ఓఇంటిలో నిద్రిస్తున్న వ్యక్తి లైటు వేసి తలుపులు తీసుకుని బయటకు వచ్చాడు అది గమనించిన దుండగులు పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం ఉదయం ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కుటుంబ ఈ శివారులో గతంలోనూ ఒకసారి విగ్రహలను దోచుకెళ్ళేందుకు యత్నించారని స్థానికులు తెలిపారు. పురాతన దేవస్థానం కావడంతో గుప్త నిధుల కోసమే ఇలా చేసి ఉంటారు.