అచ్యుతాపురం మండలం తంతడి - వాడపాలెంలో మత్స్యకారులను ఓ తిమింగలం షాక్కు గురిచేసింది. వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు శుక్రవారం భారీ తిమింగలం చిక్కింది. 30 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు ఉండటంతో ఆందోళన చెందారు. ఆ తిమింగలం అనారోగ్యంతో ఉంది. ఒకవేళ అది అక్కడే చనిపోతే రోజుల తరబడి వచ్చే దుర్వాసన భరించలేమని, వేటకు కూడా వెళ్ళలేమని వెంటనే తొలగించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు అధికారులను కోరుతున్నారు.