రాజన్న సిరిసిల్ల జిల్లా, గంభీరావుపేట మండలం నర్మల క్యాంపుకు చెందిన పంపు కాడి నాగయ్య బర్లను మేపేందుకు వెళ్లి వాగులో గల్లంతు. గంభీరావుపేట మండలం, నర్మల క్యాంపుకు చెందిన ఐదుగురు పశువుల కాపరులు పశువులకు మేపేందుకు వెళ్లారు. వాగు ఉదృతంగా ప్రవహించడంతో వాగులో పంపు కాడి నాగయ్య అనే పశువుల కాపరి గల్లంతయ్యాడు. మిగతా నలుగురు వాగు మధ్యలో చిక్కుకున్నారు. వాగులో చిక్కుకున్న నలుగురితో పాటు వాగులో గల్లంతైన నాగైన వెతకడానికి ముమ్మర గాలింపు చర్యలు జిల్లా యంత్రాంగం చేపట్టింది. హుటాహుటిన ఘటన స్థలానికి రిస్క్యూ టీం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.