ఎల్లారెడ్డి మండలంలో గత రెండురోజులుగా కురిసిన భారీ వానలకు తిమ్మాపూర్ చెరువుకు గండిపడి చేరువంత ఖాళీ అయిపోయింది. దాదాపు 1000ఎకరాలకు సాగు నీరు అందించే చెరువు నీరులేక బోసిపోవడంతో రైతుల కంటతడి పెట్టుకున్నారు. ఇప్పటికే రైతులు వేసిన వెయ్యి ఎకరాల్లో 500ఎకరాలు ముంపునకు గురై చేతికి వచ్చిన పంట అందకుండా పోయింది. అధికారులు చెరువు గండి సత్వరంగా పూడిస్తే, మళ్ళీ వర్షం పడితే చెరువులో నీరు వస్తుందన్న ఆశతో ఎదురు రైతులు చూస్తున్నారు.