అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం బి ఆలేరు తగరకుంట ప్రధాన రోడ్డు పనులను ఎమ్మెల్యే పరిటాల సునీత వివిధ శాఖ అధికారులతో కలిసి శుక్రవారం 11:45 గంటల 45 నిమిషాల సమయంలో రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వంలో రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం జరిగిందని, అయితే మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరులు రోడ్డు కాంట్రాక్టర్ ను బెదిరించడం జరిగిందని అందువల్ల రోడ్డు వేయలేదని నేడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ తో మాట్లాడి మూడు నెలల లోపులే రోడ్డును పూర్తి చేస్తామని పరిటాల సునీత పేర్కొన్నారు.