జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కోర్ కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, మంత్రి శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు, యూరియా కొరత, పార్టీ బలోపేతం, తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.