వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి : సీఐ వినాయక చవితి సందర్భంగా మండపాల ఏర్పాటుకు ఉత్సవ కమిటీలు తప్పనిసరిగా పోలీసు వారి ముందస్తు అనుమతి పొందాలని సీఐ గోపాల్ రెడ్డి సూచించారు. మండపాల వద్ద పెద్ద శబ్దాలతో లౌడ్ స్పీకర్లు పెట్ట కూడదన్నారు. ఉత్సవాల్లో అశ్లీల నృత్యాలు, డ్యాన్స్లు నిషేధమన్నారు. రోడ్లపై మండపాలు ఏర్పాటు చేయకూడదన్నారు. ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పండుగను అందరూ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.