రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని మడకశిర కు చెందిన జిల్లా వైసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు నరసింహమూర్తి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మడకశిర నియోజకవర్గ రాజకీయ స్థితిగతుల గురించి ప్రకాష్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. 2029 ఎన్నికల్లో వైసీపీ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.