బైరెడ్డిపల్లి: మండల పోలీస్ స్టేషన్ ఎస్ఐ పరశురాముడు తెలిపిన సమాచారం మేరకు. బురిశెట్టిపల్లి గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో గుర్తుతెలియని మగ వ్యక్తి శవం లభ్యమైనదని సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని భావి నుండి బయటికి తీసామన్నారు. తదుపరి చుట్టుపక్కల ప్రజలను అతని వివరాలను అడుగగా ఈ ప్రదేశానికి కొత్తగా ఉన్నాడని తెలిసింది, అతడు ప్రమాదవశాత్తు బావిలో పడి చనిపోయాడా లేదా మరి ఇంకేదైనా కోణం ఉందా అనే దిశగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. ప్రస్తుతానికి పోస్టుమార్టం కొరకు పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగిందన్నారు.