ఎల్లారెడ్డి మండలంలోని టీచర్స్ కాలనిలో ప్రతిష్టించిన టీచర్స్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఆధ్వరంలో అన్నప్రసాద వితరణ చేసారు. ఉదయం బ్రహ్మనోత్తములు వినాయకునికి ప్రత్యేకలంకరణలతో పూజలు చేసి మధ్యాహ్నం వినాయకునికి నైవేద్యం పెట్టిన అనంతరం అన్నప్రసదా వితరణ ప్రారంభించారు. వినాయక మండపం వద్ద ఆదివారం సామూహిక కుంకుమార్చన కార్యక్రమం ఘనంగా జరిగింది. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కుంకుమార్చన చేయడం చాలా మంచిదని వేద పండితులు అన్నారు. అలాగే దాదాపు 500మందికి పైగా అన్న ప్రసాదం స్వీకరించారు. మహారాష్ట్ర నుండి వచ్చిన ప్రత్యేక భజన బృందం అన్నప్రసాదాన్ని స్వీకరించి కాసేపు వినాయకుని వద్ద భజన చేశారు.