Kandukur, Sri Potti Sriramulu Nellore | Aug 28, 2025
కందుకూరు మున్సిపాలిటి అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరు చేసేలా cm చంద్రబాబు అనుమతించారని mla ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ. రూ.3.25 కోట్లతో పట్టణంలో రోడ్ల విస్తరణ, డివైడర్, సెంటర్ లైటింగ్ పనులు జరుగుతున్నాయన్నారు. పలువురు వ్యాపారులకు ఇబ్బంది కలిగినా.. పట్టణ సుందరీకరణకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం గురువారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో జరిగింది.