నేపాల్ రాజధాని ఖాట్మండులో ఎనిమిది మంది మంగళగిరి వాసులు చిక్కుకున్నారు. వారిలో మాచర్ల హేమసుందరరావు, దామర్ల నాగలక్ష్మితో బుధవారం మంత్రి నారా లోకేశ్ మాట్లాడారు. తాము ఖాట్మండు విమానాశ్రయానికి కిలోమీటరు దూరంలో పశుపతి ఫ్రంట్ హోటల్లో ఉన్నామని బాధితులు తెలిపారు. తాము ప్రయాణిస్తున్న బస్సుపై నిన్న ఆందోళనకారులు దాడి చేశారని వివరించారు. అందరినీ క్షేమంగా తీసుకొస్తామని లోకేశ్ వారికి ధైర్యం చెప్పారు. మంగళగిరి వాసులు అందర్నీ సురక్షితంగా ఇండియాకి రప్పిస్తామని మంత్రి లోకేష్ వెల్లడించారు.