కొయ్యూరు మండలంలోని రాజేంద్రపాలెం ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం సాయంత్రం అల్లూరి సీతారామరాజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ టీ.విశ్వేశ్వరనాయుడు ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా ఆయన ఆసుపత్రిలోని రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది ఎల్లప్పుడూ రోగులకు అందుబాటులో ఉంటూ, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ల్యాబ్, మందుల నిల్వలను పరిశీలించారు.