అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో సంక్షేమ ప్రదాత, అభివృద్ధి విధాత, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 16వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మంగళవారం పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మునిసిపల్ చైర్ పర్సన్ భవాని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు వై.నైరుతి రెడ్డి, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్న బాబు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టీ ప్రజల గుండెల్లో నిలిచారని అన్నారు.