మొయినాబాద్ మండలంలోని అప్పారెడ్డిగూడ చౌరస్తా KNR స్కూల్ ఎదురుగా యాక్సిడెంట్ జరిగింది. చేవెళ్ల వైపు నుంచి వస్తున్న మెట్రో బస్సు గుర్తు తెలియని మహిళా రోడ్డు క్రాస్ చేస్తుండగా ఢీకొట్టింది. డ్రైవర్ పారిపోయాడు. మహిళ తల, మొహం మీద గాయాలయ్యాయి. స్థానికులు అంబులెన్స్ ద్వారా సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.