గత మూడు రోజులుగా నిజమాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాల వల్ల రోడ్లు,బ్రిడ్జిలు పాడు, వేల ఎకరాల పంట కూడా నష్టపోవడం జరిగింది. ఈమేరకు బాల్కొండ నియోజకవర్గంలోని మోతె,భీంగల్,బడా భీంగల్ గ్రామాలలో వరదకు రోడ్లు,బ్రడ్జి , పాడైన పంటలను సంబంధిత అధికారులు, నాయకులతో కలిసి పరిశీలించిన బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. బాల్కొండ నియోజకవర్గంలో కప్పల వాగు,పెద్దవాగు చాలా ఉధృతంగా ప్రవహించాయి. రూరల్ నియోజకవర్గంలో పలు చెరువులు తెగటంతో కప్పల వాగు కు వరద ఉధృతి ఎక్కువగా రావడం జరిగింది.