శుక్రవారం దేవరకద్ర నియోజకవర్గం అడ్డకుల పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీల్లో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి. జానకి ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ సిబ్బంది విధులు, రికార్డులు, పరిసరాలను పరిశీలించి, సేవలపై ఏవైనా సమస్యలుంటే పరిశీలిస్తామని, విధుల విభజన ప్రకారం సమర్థవంతంగా సేవలందించాలని సూచించారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ఫిర్యాదుదారులందరికీ సమానంగా సేవలందించాలని తెలిపారు.