ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు జీవో 36 ప్రకారం వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి శ్రీరాములు అన్నారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర సమితి పిలుపు మేరకు మంగళవారం మున్సిపల్ కార్యాలయం దగ్గర కార్మికులతో కలిసి ధర్నా చేపట్టారు. అవుట్సోర్సింగ్ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించాలన్నారు.