ఇందిరమ్మ అంటేనే పేదల ప్రభుత్వమని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా నియోజకవర్గంలోని కోనరావుపేట మండలం కొలనూరు (గొల్లపల్లి) ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరయ్యారు.సీఎం రేవంత్ రెడ్డి బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్నారన్నారు. గత పాలకులు ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కూడా మంజూరు చేయలేదని గుర్తు చేశారు. లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు ఉన్నారు.