గుంటూరు నగరంలోని నందివెలుగు రోడ్డులోని వాటర్ ట్యాంకులను ఎమ్మెల్యే నసీర్ శుక్రవారం పరిశీలించారు. గుంటూరు నగర ప్రజలకు కలుషితం లేని తాగునీరు అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ముఖ్యంగా వర్షా కాలంలో నీరు కలుషితమయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నందున, అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, ప్రజలకు తాగునీటి సమస్యలు రాకుండా చూస్తున్నామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నగరంలో మంచినీటి సమస్య చాలా వరకు పరిష్కరించామన్నారు.