యాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆదివారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయింపులపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. పార్టీ ఫిరాయింపులపై కేటీఆర్ మాట్లాడడం 100 ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. 10 ఏళ్లలో 60 మంది ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను చేర్చుకున్నప్పుడు ఎందుకు రాజీనామా చేయించలేదంటూ ప్రశ్నించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్ కు లేదన్నారు. దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి చూపించాలని సవాల్ చేశారు.