నాగార్జున సాగర్ నుంచి ఎడమ, కుడి కాలువల ద్వారా ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన 165 టిఎంసిల నీరు రావడం లేదని విశ్రాంత IPS అధికారి AB వెంకటేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం బ్రాడీపేటలో జరిగిన ఆలోచనపరుల వేదిక సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గత, ప్రస్తుత ప్రభుత్వాలు ఏపీ నదీ జలాల హక్కులను కాలరాసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.