ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనగేశ్వర రెడ్డి కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీనీ మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు.ఈ వినతిలో ఆయన కర్నూలు నుంచి ఎమ్మిగనూరుకు ఉన్న రహదారిని జాతీయ రహదారి స్థాయికి మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ రహదారి వ్యవసాయానికి కీలకంగా ఉండడంతో పాటు, మంత్రాలయం, ఆదోని వంటి ప్రధాన కేంద్రాలను కలుపుతుంది. ప్రస్తుతం ఈ రహదారి దుర్గతిలో ఉండటంతో వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ఆటంకంగా మారింది. అత్యవసర వైద్యసేవలందకుండా ఆలస్యం కావడంతో ప్రజలు ఇబ్బందులు.