అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని చియ్యేడు గ్రామంలో సోమవారం 12:30 గంటల సమయంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పాల్గొని ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ చియ్యేడు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేయడం జరిగిందని, అదేవిధంగా జిల్లాలో 2 లక్షల 80 వేల 471 మందికి 123 కోట్ల 86 లక్షల రూపాయలు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారుల ఇంటి వద్దనే పంపిణీ చేస్తున్నామని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంగాధర్ రెడ్డి,డి ఆర్ డి ఏ శైలజ తదితరులు పాల్గొన్నారు.