పలమనేరు: రూరల్ మండలం కొలమాసనపల్లి పంచాయతీ వాసులు తెలిపిన సమాచారం మేరకు. కల్లాడు గ్రామానికి చెందిన గోవిందప్ప కుమారుడు చంద్రశేఖర్ 35 సంవత్సరాలు, కృష్ణప్ప కుమారుడు కన్నయ్య 45 ఏళ్ల వీరు ఇరువురు తమ వృత్తి బళ్లారి డ్రమ్స్ వాయించడం పని నిమిత్తం మదనపల్లి వైపు వెళుతున్నారు. నేడు సాయంత్రం పుంగనూరు మండలం సుగాలిమిట్ట వద్ద బస్సును ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న కారుని ఢీకొని ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108 సహకారంతో పుంగనూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తుండగా, కన్నయ్య మృతి చెందాడని తెలిపారు. దీంతో కల్లాడు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.