నిత్యం ప్రజా సేవలో ఉంటూ సమాజ సేవకులైన పోలీసులపై ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు పోలీసులను కించపరిచే విధంగా దుర్భాషలాడడం సిగ్గుచేటని సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీసు వ్యవస్థనే కించపరిచేలా స్పీకర్ మాట్లాడటం సరైన పద్ధతి కాదన్నారు. వెంటనే స్పీకర్ అయ్యన్నపాత్రుడు పై కేసు నమోదు చేసి చట్టపరమైన.. చర్యలు తీసుకోవాలని కిలివేటి సంజీవయ్య డిమాండ్ చేశారు.