పలమనేరు:పట్టణం పాతపేట శ్రీ కనకదుర్గ మాత ఆలయం వద్ద ఆలయ కమిటీ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 02 వరకు పదకొండు రోజులపాటు దసరా ఉత్సవాలు జరుగుతాయని, పదకొండు అలంకారాలతో అమ్మవారు దర్శనమిస్తారని తెలిపారు. మొదటి రోజు గణపతి హోమం, అష్టమి రోజు చండీ హోమం, అన్నదాన కార్యక్రమం మరియు చివర విజయదశమి రోజు అమ్మవారి ఉత్సవ విగ్రహ పట్టణ ఊరేగింపు జరుగుతుందని, భక్తాదులందరూ ఈ దసరా మహోత్సవాలకు విచ్చేసి ప్రత్యేక పూజ కార్యక్రమాలలో పాల్గొని, అమ్మవారి కృపకు పాత్రులు కాగలరన్నారు.