సీపీఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ పిలుపునిచ్చారు. గురువారం బాపట్ల రూరల్ మండలం చుండ్రుపల్లి గ్రామంలో సీపీఐ నాయకులు సమావేశమయ్యారు. ఈనెల 23న ఒంగోలులో జరగనున్న సీపీఐ రాష్ట్ర మహాసభల వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సింగరకొండ మాట్లాడుతూ సిపిఐ రాష్ట్ర మహాసభలకు సిపిఐ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.