పటాన్‌చెరు ప్రాంతంలో కార్మికుల సమస్యలను ప్రస్తావిస్తూ CITU పటాన్‌చెరు ఏరియా కమిటీ ఆధ్వర్యంలో గురువారం రామచంద్రపురం ఈఎస్ఐ ఆసుపత్రి ముందు ధర్నా చేపట్టారు. ఆసుపత్రిలో కొనసాగుతున్న మందుల కొరత సమస్యను తక్షణం పరిష్కరించాలని, అలాగే డాక్టర్లను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని వారు డిమాండ్ చేశారు. తరువాత ఆసుపత్రి సూపరిండెంట్ కి మెమోరాండం అందజేసి కార్మికుల సమస్యలను వివరించారు.