గత డిసెంబర్ మరియు జనవరి నెలలలో జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రంలో నిర్వహించిన కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియకు హాజరైన అభ్యర్థుల్లో, సివిల్ మరియు APSP విభాగాల్లో SCT-PCలుగా తుది రాత పరీక్షలో ఎంపికైన పురుష మరియు మహిళా అభ్యర్థులు, 25 వ తేదీ సోమవారం, 26 వ తేదీ మంగళవారం ఉదయం 9 గంటలకు సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకుని జిల్లా పోలీస్ కార్యాలయంలో హాజరుకావాలని ఎస్పీ అశోక్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్ధులు సెలక్షన్ ప్రక్రియలో అప్పుడు అప్లికేషనుతో జతపర్చిన ధృవీకరణ పత్రాలు అన్నియు ఒరిజినల్ సర్టిఫికెట్స్. పై అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు గెజిటెడ్ ఆఫీసర్లతో సంతకం చేయించాలన్నారు.