అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని సేవాగడ్ లో దసరా శరన్నవరాత్రులను పురస్కరించుకొని మాత జగదాంబ అమ్మవారు లలిత త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. శనివారం ఆలయంలో అర్చకులు మారుతి ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. నవరాత్రుల సందర్భంగా కర్ణాటక రాష్ట్రం నుంచి భారీగా భక్తులు తరలివచ్చి ఆలయంలో పూజలు చేశారు.