నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న అవార్డు గ్రహీత చింతలపల్లె కోటేష్ సెప్టెంబర్ 5న జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం పురస్కరించుకొని చిన్న బలపం ముక్క పై వాటర్ కలర్ పెయింటింగ్స్ తో మైక్రో బ్రష్ ద్వారా గురువు యొక్క గొప్పతనం గురించి వేశారు. ఈ చిత్రం 2 గంటల వ్యవధిలో వేశారు.ఈ చిత్రంలో త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు మరియు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, ఒక విద్యార్థి గురువుకు గౌరవ వందనం చేస్తున్నట్లు ఇలా సూక్ష్మ చిత్రాలు వేశారు. గురువులకు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.